సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జన సభను విజయవంతం చేయాలని కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది
ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య కేంద్ర కమిటీ సభ్యులు నైనాలశెట్టి మూర్తి గారు రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజు గారు హాజరవుతున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బిజెపి ప్రభుత్వం తన పాసిస్ట్ చర్యలను తీవ్రతం చేస్తా ఉంది ప్రజా తీర్పును గౌరవించకుండా రాజ్యాంగాన్ని అప హాస్య పాలు చేస్తుంది ప్రజల హక్కులను ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు నిరాకరిస్తుంది ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్ఛ పతన స్థాయిలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధంగా రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు ఒకే దేశం ఒక ఎన్నికంటూ జమిలి పేరుతో ప్రజలను దృష్టి మళ్లిస్తుంది హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలను మమ్మురం చేస్తా ఉంది హిందుత్వ ఏజెండాను అమలు చేస్తున్నారు పెరుగుతున్నధరలను నిరుద్యోగాన్ని ప్రజా సంక్షేమాన్ని విస్మరించారుదేశ సంపదను ఆదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులకు అభివృద్ధి పేరుతో దోచిపెడతా ఉంది ఆదివాసీలు దళితులు మైనార్టీ ప్రజానీకంపై దాడులు పరంపర కొనసాగుతుంది అంతకులను విడుదల చేస్తూ సత్కారాలు సన్మానాలు చేస్తా ఉంది సంబరాలు చేస్తూ మరోవైపు హక్కుల కార్యకర్తలను ఉద్యమకారులను క్రూర చట్టాల కింద జైల్లో పెడుతున్నారు ఫాసిస్ట్ శక్తులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు గత ప్రభుత్వ విధానాలను అనుసరిస్తుంది ఉచిత విద్య వైద్యం ఉపాధి భూమి నిరుపేదలకు దక్కాలని సంగిడిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ జనసభకు అధిక సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పట్టణ కార్యదర్శి చంద్రగిరి శంకర్ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రగిరి ఉదయ్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కన్నూరి డానియల్ నీలాల రమేష్ తదితరులు పాల్గొన్నారు