జోగా రాంబాబు టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఆశ్రమ గల్స్ హైస్కూల్ ఆళ్లపల్లి మండలం అనంతోగు నందు రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహా సభల వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. టి పిటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశం లో టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగా రాంబాబు ప్రసంగిస్తూ ఈ నెల 11,12తేదీలలో జరుగు మహాసభల కు ముఖ్య అతిధులు మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ, ఇంధన శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయ, చేనేత శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ, హౌసింగ్ సమాచారశాఖ మాత్యులు ధన సరి అనసూయ సీతక్క మహిళ మరియు శిశుసంక్షేమ శాఖ మాత్యులు, మరియు ముఖ్య వక్తలు ప్రొపెసర్ జగ్ మోహన్ సింగ్, ప్రొపెసర్ జి హరగోపాల్,
ప్రొపెసర్ బుర్ర రమేష్,
బుర్రా వెంకటేశం, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి దేవసేన కమీషనర్ మరియు పాఠశాల విద్యా సంచాలకులు మరియు ముఖ్య నాయకులు హాజరుగు చున్నారు, ఉపాధ్యాయులు మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఖమ్మం లో జరుగు రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహా సభలను జయప్రదం చేయాలనీ ఆయన పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు బావ్ సింగ్, వై నాగేశ్వరరావు,ఉపాధ్యాయులు నాగేంద్ర బాబు, లక్ష్మి నారాయణ, బాను చందర్, లక్ష్మన్, లక్ష్మి బాయమ్మ, హైమ వతి, విజయశాంతి, యర్ర య్య, వసంత రావు, భద్రమ్మ, రాధ బాయి, స్వాతి, కొమరం రాంబాబు, కల్తీ వసంత రావు తదితరులు పాల్గొన్నారు.