Challa Dharma Reddy Urges Support for BRS Sarpanch Candidates
బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి
మాజీ ఎమ్మెల్యే చల్లా
నడికూడ,నేటిధాత్రి:
కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారంటీ లు ఏమయ్యాయని నిలదీసి అడగాల ని ఓటర్లకు పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి పిలుపు నిచ్చారు మండలంలోని ముస్త్యాలపల్లి, కంఠాత్మకూర్ గ్రామాల్లో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరు చెప్పి ప్రజలను మోసం చేసిందని,వాటిని గుర్తించాలని సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని,దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మేమే చేశామని గొప్పలు చెప్పు కుంటూ ప్రజలను మరోసారి మోసం చేసుకుంటూ వస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఆలోచించి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు,వార్డ్ మెంబర్లు గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు. నడికూడ మండల కేంద్రంలో బిఆర్ఎస్ బల పరిచిన గోనెల శరత్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే శరత్ కుమార్ వల్లనే అవు తుందని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలందరినీ కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు,ఉప సర్పంచ్ కిన్నెర మణి,గ్రామ కమిటీ అధ్యక్షులు నారగాని శ్రీనివాస్,బిఆర్ఎస్ నాయకులు సంగని వేణు, మల్లారెడ్డి,నేరుగొమ్ముల ప్రభాకర్ రావు ఊర సతీష్ రావు,రావుల కిషన్,తాళ్ల రమేష్,యూత్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
