
9 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి..
*కార్మికులు, కర్షకులను కార్పొరేట్లకు బానిసలను చేసే విధానాలను వ్యతిరేకించండి..
*ఐఎఫ్ టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ పిలుపు..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 07:
జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్ టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపురం లోని ఐఎఫ్టీయు కార్యాలయంలో సమ్మె గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ రైతు, కార్మిక వ్యతిరేఖవిధానాలతో కేంద్రంలోని బాజాపా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తోందన్నారు. నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని, నూతన వ్యవసాయమార్కెటింగ్ చట్టాన్ని ఉపసంహరించాలని,కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కార్మిక, ఉద్యోగ, రైతులు చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం జరుగుతోందని చెప్పారు. సమ్మె ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామిశెట్టి వెంకయ్య మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్, పెట్టుబడిదారులకు రైతులను, కార్మికులను బానిసలుగా చేసే దుర్మార్గపు చర్యలకు కేంద్ర పాల్పడుతోందని దీనికి వ్యతిరేకంగా జరిగే సమ్మెలో రైతులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఐఎఫ్టీయు నగర కన్వీనర్ లోకేష్ మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం 9.30 గంటలకు అంబెడ్కర్ విగ్రహం వద్ద నుంచి ఐ ఎఫ్
టి యూ, సి ఐటి యూ,
ఏ ఐ టి యూ
సి, ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐకే ఎం ఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు పి. వెంకటరత్నం, పీ ఓడబ్ల్యు జిల్లా కన్వినర్ అరుణ, అంగన్ వాడీ వర్కర్స్ ఫెడరేషన్ నగర అధ్యక్షురాలు సుజాత, నాయకురాలు గంగాదేవి తదితరులు పాల్గొన్నారు..