
మందమర్రి, నేటిధాత్రి:-
తెలంగాణ ముస్లీం ఆర్గనైజేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని మంజునాథ గార్డెన్ లో నిర్వహించూ ముస్లీం డిక్లరేషన్ సభకు ముస్లీం ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, సభను విజయవంతం చేయాలని జేఏసీ కన్వీనర్ ఎండి ఇబ్రహీం, నాయకుడు ఎండీ ఆజాం ఆలీ లు కోరారు. శనివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ డిక్లరేషన్ సభకు మైనారిటీ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ అన్సారీ, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు, ఓయూ ముస్లీం జెఏసి కన్వీనర్ సయ్యద్ సలీం పాషా, కవి, రచయిత జేఏసీ కో కన్వీనర్ ఎస్కే యుసూఫ్, జాక్ కో కన్వీనర్, ఓయూ స్కాలర్ మహ్మద్ యునుస్, జాక్ కోర్ కమిటీ సభ్యుడు, ఓయూ రీసెర్చ్ స్కాలర్ జీనత్ ఆజ్మి సయ్యద్, జేఏసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్ నవాజ్ లు హాజరు అవుతున్నారని తెలిపారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో ముస్లీంల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరే లేదని ఆరోపించారు. ముస్లీం ప్రజల డిమాండ్ల పరిష్కారానికై, జనాభా దామాషా ప్రకారం వారికి రావలసిన హక్కులు వారికి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి ఇస్మాయిల్, ఎండి షరీఫ్, ఎండి శరోవర్, ఎండి మొహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.