రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల్నే వెంకట మల్లయ్య
స్టేషన్ ఘనపూర్ జనగాం నేటి ధాత్రి
, కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 22నాడు హైదరాబాదులోనీ ఇందిరా పార్కు వద్ద జరిగే కల్లుగీత కార్మికుల మహా ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ను ఈరోజు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో శివునిపల్లి సంఘం ఆఫీసులో మండల అధ్యక్షులు మాచర్ల రఘురాముల గౌడ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య అధ్యక్షతన పోస్టర్ ఆవిష్కరించారు.
అనంతరం కల్లుగీత కార్మిక సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల్నే వెంకట మల్లయ్య గౌడ్. మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది చనిపోవడం, కాళ్ళు చేతులు విరగడం, నడుము పడిపోవడం జరుగుతుంది. రెండు రోజులకు ఒకరు చనిపోతున్నారు. వీరి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని, సేఫ్టి మోకులు ఇవ్వాలని, సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, సెప్టెంబర్ 22 (శుక్రవారం) రోజు హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నాము. దీనికి రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది గీత కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నామని అన్నారు.
మనం బ్రతుకుతెరువు కోసం వృత్తి ప్రమాదమైనప్పటికీ చేస్తున్నాము. సంవత్సరానికి సుమారు 550 మంది చెట్టుపై నుంచిజారి పడుతున్నారు.వీరిలో 180 మంది చని పోతున్నారు,
కాళ్లుచేతులువిరుగుతున్నాయి. నడుములుపడిపోతున్నాయి. ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు. అని అన్నారు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉన్నది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ అధ్యక్షులు, మంత్రివర్యులు కేటీఆర్, ప్రమాదాలు. నివారించే చర్యలు తీసుకుంటామని, గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తామని, లిక్కర్ షావులు సొసైటీలకు ఇస్తామని తదితర గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వాటిని నేటి వరకు అమలు చేయలేదు. ఇటీవల జరిగిన లిక్కర్ షాప్ టెండర్ల లో సొసైటీలకు రిజర్వేషన్స్ కల్పించకుండా పాత పద్ధతినే కొనసాగించారు. మోపెడ్ లు ఇస్తారని గత మూడు సంవత్సరాల నుండి ఆశతో ఎదురుచూస్తున్న మన గీత కార్మికులకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా వారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్ గ్రేషియా యధావిధిగా కొనసాగిస్తూనే ముఖ్యమంత్రి కెసిఆర్, ఇటీవల ప్రకటించిన గీతన్న బీమా అమలు చేయాలి. ఇటివల బిసి కుల వృత్తిదారులకు ఇచ్చిన జీవో నెంబర్ 5 ప్రకారం కల్లుగీత వృత్తి చేస్తున్న వారందరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందించాలి. సొసైటీలకు భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలి. 2021 డిసెంబర్ 10వ తేదీన కల్లుగీత కార్మిక సంఘం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఐ.ఏ.ఎస్. మనం కోరిన విధంగా వృత్తిలో ప్రమాదాలు జరిగి చనిపోయిన వారి కుటుంబాలకు దహన ఖర్చులకు 25,000 లు, దెబ్బలు తగిలిన వారికి 15,000లు ప్రభుత్వాన్ని ఒప్పించి టాడి కార్పోరేషన్ ద్వారా ఇస్తున్నారు. వీటిని పెంచి చనిపోయిన వారికి 50,000 వేలు దెబ్బలు తగిలిన వారికి 25000,ఇవ్వాలని కోరుతున్నాము.
ప్రభుత్వము ఇచ్చిన హామీలు పరిష్కారం చేయనందున. సెప్టెంబర్ 22న హైదరాబాదులో రాష్ట్ర మహాధర్నా ను నిర్వహించడం జరుగుతుందని కల్లుగీత కార్మికులు గౌడ సోదరులు వృత్తిదారులు అందరు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహా ధర్నాను జయప్రదం చేయాలనీ వారు పిలుపు ఇచ్చారు
.ఈ కార్యక్రమంలో కే .జీ .కే.ఎస్ జిల్లా కమిటీ సభ్యులు, మాచర్ల రఘురాములు, కె జి కే స్ పొన్నం రంజిత్, గౌడ్ కత్తి శ్రీనివాస్, మాచర్ల బిక్షపతి, వడ్లకొండ నరసయ్య ,వంగ వేణి వంగ సురేష్, బత్తిని శీను, తాళ్లపల్లి బాబు, గట్టు వెంకటయ్య, ఆకుల శ్రీనివాస్, వీరగోని నారాయణ, రాజు, బత్తిని అబ్బసాయిలు, బత్తిని సుధాకర్ పులి స్వామి, పల్లె అశోక్ , ఎల్లయ్య, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు