విద్యార్థులకు బ్లాంకెట్స్, స్వెటర్లను పంపిణీ
భూపాలపల్లి నేటిధాత్రి
శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు చలికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విద్యార్థులకు బ్లాంకెట్స్, స్వెటర్లను అందజేశారు. భూపాలపల్లి జంగేడు లోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతీ గృహ విద్యార్థులకు బ్లాంకెట్స్, స్వెటర్లను జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర
సత్యనారాయణ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వ హాస్టల్స్‌లో చదువుతున్న విద్యార్థులు అన్ని సౌకర్యాలతో చదువుకోగలిగే వాతావరణం ఏర్పరచడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒరిజినల్ కలెక్టర్ విజయలక్ష్మి బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిరా ఎస్సీ వెల్ఫేర్ అధికారి సుకీర్తి జంగేడు ఎస్సీ హాస్టల్ వార్డెన్ రాజయ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
