
ఏఎంసి వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడానికి వస్తున్న సందర్బంగా మొగుళ్లపల్లి మండలంలోని ప్రజలు రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అత్యధికంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ. కెసిఆర్ కుటుంబ పాలనలో పరిష్కారం కానీ సమస్యలనుకాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పరిష్కారమయ్యాయని. కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుల పాల అయిందని. ప్రజా పాలనలో 56,000 కోట్లు అప్పులను తీర్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేదే కాంగ్రెస్ పార్టీ అని. పది సంవత్సరాలలో పెరగని మెస్ చార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని. గత ప్రభుత్వంలో అమలు చేయని ఎన్నో సంక్షేమ పథకాలను 11 నెలల్లోనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీతనంతో పరిపాలనను అందిస్తుందని. తెలంగాణ రాష్ట్రంలో అనేక మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని. ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారని, డీఎస్సీ ద్వారా కొత్తగా ఉపాధ్యాయుల నియామకాలను కూడా పూర్తి చేయడం జరిగిందని. భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా భూపాలపల్లి ని అభివృద్ధిలో ముందు వరసలు నిలబెట్టేందుకు దృఢ సంకల్పంతో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని నేడు జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను ప్రజలు కార్యకర్తల నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు పర్యటనలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు.