
BC Welfare Leader Calls for Successful State Bandh
బీసీ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయండి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు డా.సిరికొండ శ్రీనివాసాచారి
పరకాల నేటిధాత్రి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ల కోసం బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు,విద్యావేత్త ఎస్వీ విద్యాసంస్థల అధినేత డాక్టర్.సిరికొండ శ్రీనివాసాచారి పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీ ఓ 9 కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ,రిజర్వేషన్ ల బిల్లును షెడ్యూల్ 9 లో చేర్చాలని ఇందు కోసం కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.30 బీసీ సంఘాల వాదనలు వినకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదలచేసిన తరువాత హైకోర్ట్ స్టే ఇవ్వడం బీసీ లను మోసం చేయడమేనని అన్నారు.ఇట్టి రిజర్వేషన్ సాధించేవరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కొసం చేసిన తరహ ఉదృతమైన ఉద్యమాలు,పోరాటాలు సాగిస్తామని తెలిపారు.
ఇందుకోసం ఈ నెల 18 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు బీసీ ల బంద్ ను అన్నివర్గాల ప్రజలు,కులాలు,మతాలకు అతితంగా స్వచ్చందంగా బంద్ పాటించి,సహకరించి బంద్ ను విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమము లో బీసీ రాష్ట్ర నాయకులు ఎడ్ల సుధాకర్,బసాని సోమరాజుపటేల్,డా.శివదేవ్,సూత్రపు శివాజీగణేష్ నాయి,సూర సతీష్ పటేల్,అల్లం మధుసూదన్ ముదిరాజ్,మహిళా నాయకులు దుంపేటి యశోద,మౌనిక,తూముల అనిత,లక్కం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.