BC Rights Protest in Bhupalpally
బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయండి
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద 42% బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నవంబర్ 15న జరిగే బీసీ ఆక్రోశ సభ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ క్యాతం మహేందర్ మాట్లాడుతూ గత 78 సంవత్సరాల స్వతంత్ర భారత ప్రయాణంలో దేశ జనాభాలో మెజారిటీ అయిన బీసీలు ప్రతి రంగంలోనూ అణచివేయబడ్డారు. రాజకీయ, ఆర్థిక, విద్యా ,ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎక్కడ కూడా వారికి జనాభా నిష్పత్తికి సరిపడా ప్రాతినిధ్యం లేదు. రాజకీయంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు ,అందువల్ల చట్టసభలలో వారి ఉనికి నామ మాత్రమే. ఉద్యోగాలు మరియు విద్యా రంగాల్లో కూడా రిజర్వేషన్లు పూర్తిగా అమలు కావడం లేదు. రాష్ట్రంలో 130 కులాల బీసీ సమూహం రెండు కోట్ల నలభై లక్షల జనాభా ఉండగా ,వారు పొందుతున్న రిజర్వేషన్ కేవలం 29 శాతం మాత్రమే, కేంద్రంలో రిజర్వేషన్లు 1993 నుంచి అమలు కాగా, రాష్ట్రంలో 1972 నుంచి అమలు కావడంతో లక్షలాది బీసీ యువత ఉద్యోగాలు ,విద్యా అవకాశాలు కోల్పోయారు, ఆర్థికంగా వ్యాపార రంగంలో కూడా బీసీల ఉనికి లేనట్లుగానే ఉంది. ఈ పరిస్థితుల్లో బీసీ సమాజం” మా వాటా మాకు కావాలి – మా అధికారం మాకు కావాలి” అనే నినాదంతో మేల్కొని తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినవి. హిస్సా ,ఇజ్జత్, హుకుమత్ కొరకు పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. 42శాతం రిజర్వేషన్ ను భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలననీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుతానికి డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మాజీ ఎంపిటిసి కలిపాక రవి బీసీ జేఏసీ కో – ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ అడ్డగట్ల శ్రీధర్ వంగపండ్ల రాజయ్య యాదవ్ కనుకం మల్లన్న ముత్యాల రవికుమార్ నాయి భిక్షపతి గౌడ్,మిరియాల మల్లన్న వడ్డెర సంఘం మండల అధ్యక్షులుమంతెన రాకేష్ తిరుపతి రేణుకుంట్ల మహేష్ ,శిలపాక హరీష్ మంత్రి రాజబాబు కడపాక రవి తదితరులు పాల్గొన్నారు.
