
నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి
పేపర్ లీకేజీ పై విచారణ జరిపించాలి.
యునైటెడ్ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యునైటెడ్ స్టూడెంట్ యాక్షన్ కమిటీ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సౌత్‌కు ప్రవీణ్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు లు మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజ్ పై, అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జి చే విచారణ జరిపించి,
నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని, NTA రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థుల పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ వైఖరినీ నిరసిస్తూ ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టు పీజీ వరకు విద్య సంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు.
24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేస్తున్న NTA,NDA ప్రభుత్వం దీనిపైన మాట్లాడి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించకుండా కౌన్సిలింగ్ కు పిలవడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ విద్యార్థుల భవిష్యత్తు దృశ్య దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల4వ తేదీన జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని కోరారు.ఈ విద్యా సంస్థల బంద్ లో ప్రైవేటు,ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు నేరెళ్ల జోసెఫ్, మట్టేవాడ సురేష్, కునురి భగత్, చిట్యాల అఖిల్,మాతంగి దిలీప్, అకుదరి సరేవరం, వినోద్,రాజేష్,తిలక్ తదితరులు పాల్గొన్నారు.