
CPI Gears Up for 4th State Conference..
సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి
దొంగ ఓట్లతో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం సిగ్గుచేటు
సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ నాయకులతో కలిసి గోడపత్రికలను భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతు 99 వసంతాలను పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను ఈ నెల ఆగస్టు 19నుండి 22వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అని తెలిపారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా,కార్యదర్శి కే నారాయణ లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన నిరంతరం పేదల పక్షాన పోరాటం చేసేది కేవలం కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నకిలీ ఓట్లతో అధికారంలోకి రావడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. నరేంద్ర మోడీ ఎన్నికల కమిషన్, ఈడి తన గుప్పెట్లో ఉంచుకొని ఇష్టానుసారంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. దేశ ప్రజలకు ఎన్నికల వ్యవస్థ పైన నమ్మకం పోయిందని తెలిపారు. ఈ రాష్ట్ర మహాసభలో భవిష్యత్ కార్యచరణ రూపొందించుకొని ఆందోళన పోరాటాలను కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గారంటీల హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కొత్త పింఛన్లను మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. మేడ్చల్ జిల్లాలో జరిగే సిపిఐ 4వ రాష్ట్ర మహాసభలను ప్రజలు, మేధావులు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎండి జాఫర్ నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ ఎండి యాకుబ్ పాషా గోనెలా తిరుపతి ఎన్ఎఫ్ఐడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు గోలి లావణ్య, డిహెచ్ పీఎస్ నాయకురాలు పొన్నగంటి లావణ్య రమేష్ చారి శ్రావణ్ దేవేందర్ రవీందర్ స్వామి ఏకు రాములు పాండవుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.