
Sirisilla to Host 3rd CITU Construction Workers Mahasabha
జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయండి
సెప్టెంబర్ 15 న మహాసభ
యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి పిలుపు
సిరిసిల్ల టౌన్ *(నేటిధాత్రి)
సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్లలో జరగబోయే భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు జిల్లా 3 వ. మహాసభల కరపత్రాలను ఈరోజు బి.వై. నగర్ లోని కామ్రేడ్.. అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో నాయకులు ఆవిష్కరించడం జరిగినది.
ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని భవన నిర్మాణ కార్మికుల ఉపాధి , సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు గత పోరాటాలను సమీక్షించుకొని ఉద్యమ కార్యచరణను రూపొందించుకోవడం కోసం యూనియన్ జిల్లా 3 వ. మహాసభలను సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఇట్టి మహాసభలలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు , గురజాల శ్రీధర్ , కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.