సిపిఐ కరీంనగర్ నగర11వ మహాసభను జయప్రదం చేయండి.
సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు
కరీంనగర్, నేటిధాత్రి:
ఈనెల 18వ తేదీన సిపిఐ కరీంనగర్ నగర పదకోండవ మహాసభ నగరంలోని గణేష్ నగర్ లో గల బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో ఉదయం 10:30 గంటలకు జరగనుందని ఈయొక్క మహాసభకు నగరంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభను విజయవంతం చేయాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు కోరారు.
ఈయొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామిలు హాజరై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈయొక్క నగర మహాసభలో కరీంనగర్ నగరంలోని అరవైవ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయుటకు కార్యకర్తలను సంసిద్ధం చేయడం జరుగుతుందన్నారు.
నగరంలో గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పనులు అటకెక్కాయని గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద అనేక పనులను శంకుస్థాపనలు చేసి వదిలేసిందని చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని ఎన్నికల ముందు చెప్పి పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు.

స్మార్ట్ సిటీ పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగాయని, మానేర్ రివర్ ఫ్రంట్ తీగల వంతెన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించి రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని గత మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డందని భూకబ్జాలు, ఇండ్లు కడితే కమిషన్లు, ఇంటి నెంబర్ కు డబ్బులు తీసుకుని నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారని ఈసమస్యలతో పాటు నగరంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం రేషన్ కార్డుల కోసం అర్హులైన వారికి పెన్షన్ల కోసం రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్ళుటకు ఈమహాసభ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం, ఆరు గ్యారెంటీలు అర్హులైన వారికి అందే వరకు ఉద్యమాలతో ఒత్తిడి తీసుకువచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందే వరకు పోరాట కార్యాచరణ చేస్తామని సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు తెలిపారు. ఈమహాసభ నగర ప్రజల దశ దిశ మార్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. కావున నగర ప్రజలు మహాసభలో అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.