
ఇ. శ్రీశైలం.పి డి స్ యు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పిలుపు.
కొత్తగూడ, నేటిధాత్రి :
రేపు అనగా జూలై 6,7 తేదీలలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో పిడిఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఈ సమావేశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలు పిడిఎస్యు నిర్మాణం విద్యా వ్యవస్థలో వస్తున్న సమూల మార్పులపై చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే దేశంలో మూడవసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా పాఠ్యాంశాలలో మతచాందస భావజాలాన్ని వ్యతిరేకిస్తూ ఈ కౌన్సిల్లో విద్యార్థి లోకానికి అవగాహన కల్పించి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో నిర్వహించిన ఉద్యమ కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాలను రూపొందించుకోవడానికి ఈ యొక్క కౌన్సిల్ ఉపయోగపడుతుందని కావున విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమాలను..