జాడి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
గంగారం, నేటిధాత్రి :
ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క పర్యటన తేదీ 19/0/2024 సోమవారం ఉదయం 10 గంటలకు గంగారాం కస్తూరిబా గురుకుల పాఠశాల రెండున్నర కోట్లతో నిర్మించబడిన నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమము, అభివృద్ధి పనిలో భాగంగా అదనపు కస్తూరిబా గురుకుల భవనం కోసం మరో రెండున్నర కోట్ల రూపాయల భవనం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడును ఇట్టి కార్యక్రమం సీతక్క చేతుల మీదుగా ప్రారంభోత్సవం భూమి పూజ కార్యక్రమం జరుగును అనంతరం గంగారం మండలం కేంద్రంలో మరియు బావురుగొండ గ్రామపంచాయతీ యందు సిసి రోడ్ల నిర్మాణం పనుల ప్రారంభించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు గంగారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ల సమక్షంలో మంత్రి సీతక్కకు ఘన సన్మానం నిర్వహించబడును తదుపరి ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి గిరిజన కుంభమేళా మహా జాతర ను పురస్కరించుకొని పగిడిద్ద రాజు దేవాలయంలో అభివృద్ధి పనులలో భాగంగా సిసి రోడ్ల ను ప్రారంభించడం జరుగుతుంది. పగిడిద్దరాజు పూజారుల సమక్షంలో దర్శనము పూజా కార్యక్రమంలో పాల్గొంటారు ఇట్టి కార్యక్రమంలో మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ కిసాన్ సేల్ విభాగం నాయకులు పాల్గొనగలరని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు…