“మేడే” కార్యక్రమాలను విజయవంతం చేయండి
సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపు
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చంద్రంపేట ఏరియాలో ప్రపంచ కార్మిక దినోత్సవం 139 “మే డే” కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆవిష్కరించారు. అనంతరం తాను మాట్లాడుతూ కార్మిక వర్గం , కష్టజీవులు పోరాడి హక్కులు సాధించిన రోజు “మే డే” అని అన్నారు.
సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా “మేడే” కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మే 1 వ. తేదీన ఉదయం 8 గంటలకు చంద్రంపేట ఏరియాలో సి.ఐ.టి.యు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఉదయం 10 గంటలకు సిరిసిల్ల పట్టణం బి.వై. నగర్ లోని జెండా చౌరస్తా వద్ద “మే డే” అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి భారీ బహిరంగ సభ , భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇట్టి “మేడే” కార్యక్రమాలు , వేడుకలలో పవర్లూమ్ , వార్పిన్ , వైపని అనుబంధ రంగాల కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గుండు రమేష్,సబ్బని చంద్రకాంత్, రమేష్, శ్రీను, నర్సయ్య, శ్రీకాంత్, వైపని వర్కర్స్ యూనియన్ నాయకులు ఎక్కల్ దేవి జగదీష్,చెముటి రాము , మ్యాన రాజు,గడుదాస్ వేణు,ఇమ్మశెట్టి లక్ష్మణ్,మిట్టపల్లి ప్రసాద్,బోగ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.