ఈ నెల 26 న మాదిగల ధర్మ యుద్ధ మహసభను విజయవంతం చేయండి.

చిట్యాల, నేటిధాత్రి :

ఈ నెల 26వ తేదీన వరంగల్ డి కన్వెన్షన్ లో జరిగే మాదిగల ధర్మయుద్ధ మహాసభను విజవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల ఇంచార్జిలు నేరెళ్ల ఓదెల్ మాదిగ, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సీనియర్ నా యకులు నోముల శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు మేకల రమేష్ మాదిగ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొదటిసారి తానే వర్గీకరణ చేస్తానని అవసరమైతే గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లకు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పి రెండు నెలలు గడుస్తున్న చేయకపోగా కమిటీలు కమిషన్ల పేర్లతో కాలయాపన చేస్తూ మాదిగలను నమ్మించి మోసం చేయడం మరియు గ్రూప్-1 గ్రూప్-2 తో పాటు డిసెంబర్ నాటికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ లేకుండానే వాటిని పూర్తిచేసే పనిలో ఉన్నారని మాదిగల ను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖండిస్తూ మహాజన నేత మంద కృష్ణ మాదిగ తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాల్లో పర్యటనలో భాగంగా ఈ నెల 26 న ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మ యుద్ధ మహసభను జిల్లా లోని ప్రతి ఒక్క మాదిగ విద్యార్థి మరియు నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్య క్రమంలో ఎంఎస్పి జిల్లా నాయకులు అంబాల అనిల్ కుమార్ మాదిగ నరేష్ మహేష్ రాకేష్ రాజు సందీప్ హరీష్ ప్రభు తదిరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!