
#వెంకటాపూర్ భారాస పార్టీ అధ్యక్షులు లింగాల రమణారెడ్డి
వెంకటాపూర్, నేటిధాత్రి:
వెంకటాపూర్ మండలంలోని వివిధ గ్రామాలైన పాలంపేట, గుంటూరుపల్లి, రామంజపూర్, నారాయణగిరిపల్లి, వెల్తుర్లపల్లి, గుర్రంపేట, రాంనాయక్ తండా, పెరుకపల్లి, పెద్దాపూర్, సుబ్బక్కపల్లి, మల్లయ్యపల్లి, ఎస్సీ కాలనీ గ్రామాల్లో రేపు బుధవారం రోజు ఉదయం ఏడు గంటల నుండి ములుగు నియోజకవర్గ భారాస పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి ఇంటింటా ప్రచార పర్యటన ప్రారంభం కానుందని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఎంపీపీ, జడ్పిటిసి, కోఆప్షన్ సభ్యులు, మండల, జిల్లా, రాష్ట్ర సీనియర్ నాయకులు, మండల ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు, పిఎసిఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు, మరియు మండల కోఆర్డినేటర్, గ్రామ కోఆర్డినేటర్లు, మండల అధికార ప్రతినిధి, జాగృతి అధికార ప్రతినిధి, మండల పార్టీ కార్మిక, మహిళ, ఎస్సి సెల్, బీసీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జీలు, మేడారం డైరెక్టర్, యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి, పూర్వపు ఎంపీపీ, జడ్పిటిసి, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, 100 ఓట్ల ఇన్చార్జీలు, బూత్ ఇన్చార్జీలు, కార్యకర్తలు అభిమానులు మరియు మండల పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తప్పనిసరిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని కోరారు.