అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై ప్రకాష్
కారేపల్లి నేటి ధాత్రి
సంయుక్త కిసాన్ ముర్చా ఎస్ కే యం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 16న జరిగే భారత్ బందును విజయవంతం చేయాలని సింగరేణి మండలం పేరుపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించి జనరల్ బాడీ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి వై ప్రకాష్ మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్న ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ ఒక్కటి అమలు చేయలేదని కార్మిక కర్షక నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినారని నల్లధనం వెలికి తీసి ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానన అలాగే సంవత్సరం నర కాలం పాటు సాగిన ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి 750 మంది అమరవీరుల సాక్షిగా వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి మూడు నల్ల చట్టాలను విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకుంటున్నా నీ లిఖితపూర్వకంగా వ్రాసి హామీలు ఇచ్చి వాటిని రద్దు చేయకపోగా తిరిగి వాటిని దొడ్డిదారిన అమలుపరుస్తున్నారని ఎన్నో త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి వేసినాడని వీటన్నిటికీ వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలందరూ ఐక్యమై ఈనెల 16న జరిగే పారిశ్రామిక బందును గ్రామీణ భారత్ బందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకే ఎమ్మెస్ జిల్లా నాయకులు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి వై జానకి మంగమ్మ అలెం చంద్రయ్య నాగేశ్వరరావు ఎదల పెళ్లి శ్రీను శేఖర్ కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.