గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి.

మహా ముత్తారం నేటి ధాత్రి.

కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇంటింటికి వెళ్లి లక్షలాది కుటుంబాలు అని శ్రామికుల్లో ప్రచారం చేయాలని 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె౼ గ్రామీణ భారత్ బందు నిర్వహించాలని జాయింట్ ప్లాట్ ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఉద్యోగ సంఘాలు అఖిల భారత దేశంలో సంయుక్త కిషోర్ మోర్చా అఖిల భారత స్థాయిలో నిర్ణయించాయి తెలంగాణ రాష్ట్రంలో జరిగే కార్మికుల సమ్మె గ్రామీణ బంధును జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విజయవంతం చేయాలని ప్రజాసంఘాలు సిఐటియు తెలంగాణ రైతు సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జిఎంపిఎస్ ఐద్వా ఇచ్చిన పిలుపులో భాగంగా మహా ముత్తారం మండల కేంద్రంలోని గ్రామీణ భారత్ బంద్ కు సంబంధించిన కరపత్రాలు వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయిందని,కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని వారన్నారు. అధికారంలోకి వచ్చే మందు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని అదేవిధంగా స్విస్ బ్యాంకు నుండి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదవారి బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని హామీ ఇచ్చిందని వారు గుర్తు చేశారు. కానీ ఇవేమీ చేయకపోగా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరిందని, ధరలను నియంత్రి స్తామని వాగ్దానం చేసిన బిజెపి ప్రభుత్వం ధరలు కనివిని ఎరగని రీతిలో 30 నుండి 56% వరకు పెరిగాయని అన్నారు, పెట్రోలు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పనుల వాటాను 243 శాతానికి పెంచిందని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులు కార్పొరేట్ల పరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నేషనల్ మానిటైజేషన్ పాలసీ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేరుతోటి ప్రభుత్వ ఆస్తులను మొత్తం ప్రైవేటుపరం చేస్తుందని, కార్మికులు మధ్యతరగతి ప్రజల్లో అత్యధికులు పాలసీదారులగా ఉన్న ఎల్ఐసి వాటాలను అమ్మేందుకు తెగబడిందని, కార్పొరేట్లు ఎగ్గెట్టిన రుణాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నెరవేర్యం చేస్తున్నదని, అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందని వారు మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతంలో కొద్దో గొప్ప ఉపాధి దొరికే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నేరుగాస్తుందని వారన్నారు, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి 200 రోజుల పని కల్పించి రోజు కూలీ 600 రూపాయల ఇవ్వాలని కోరితే అంగీకరించడం లేదని అన్నారు, రైతులు పండించిన పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు, అనేక సంవత్సరాలుగా పోడు సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్న తోడు సాగుదారులకు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి హక్కు పత్రాలు ఇవ్వకుండా అటవీ నుంచి గెంటి వేసే విధంగా జాతీయ నూతన అటవీ విధానం ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ తీసుకువచ్చి అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తోందనితుందని, పెట్రోలు డీజిల్ పై పనులు అధికంగా పెంచడం వలన నిత్యవసర సరుకుల ధరలు అమాంతం పెరిగి కొనలేని స్థితికి ప్రజలను దిగజార్చిందని వారన్నారు, కావున ఈ పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజావ్యతిరేక విధానాలు అతని ధోరణులకు నిరసనగా ఫిబ్రవరి 16న జరుగుతున్న దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయడం కోసం మహాముత్తారం మండల కేంద్రంలో జరగబోయే ర్యాలీ ప్రదర్శనకు వేల సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలం చిన్న రాజేందర్ తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాధారపు మల్లయ్య మరియు గడ్డం రాజయ్య ముక్కెర చంద్రయ్య, వేముల రఘు బైరవేణి లక్ష్మయ్య, గందే లక్ష్మయ్య, దూలం చంద్రయ్య, వేములవాడ సత్యం, గడ్డం వెంకట్రాజము ముక్కెర లచ్చయ్య, బుర్ర రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!