పోలీస్ కమిషనర్ ను కలిసిన కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి.
కాశిబుగ్గ నేటిధాత్రి.
దసరా ఉత్సవాల సందర్భంగా కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ అంబటి కిషోర్ జా ను కలిసి వినతి పత్రం అందజేశారు. గత 30 సంవత్సరాలుగా కాశిబుగ్గ చిన్న వడ్డేపల్లి చెరువు(పద్మా నగర్) వద్ద నిర్వహిస్తున్న దసరా వేడుకలు, రావణాసురవధ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ సమితి తెలియజేశారు.ఈ రావణాసురవద ఉత్సవానికి వరంగల్ శాసనసభ్యులు మంత్రివర్యులు కొండా సురేఖ మరియు పార్లమెంటు సభ్యులు కడియం కావ్య తో పాటు నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామి రెడ్డి, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్, మరియు అనేక మంది ప్రజా ప్రతినిధులు తోపాటు ఈ ఉత్సవాలను తిలకించడానికి సుమారు లక్ష మంది ప్రజానీకం హాజరవుతారని తెలిపారు.కావున ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిచే తగు బందోబస్తు ఏర్పాటు చేయాలని కమిషనర్ ను ఉత్సవ సమితి కోరడమైనది. కమిషనర్ ను కలిసిన వారిలో ఉత్సవ సమితి కన్వీనర్ బయ్య స్వామి, ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, గుల్లపల్లి రాజ్ కుమార్, సిలువేరు శ్రీనివాస్, గోరంటల మనోహర్, సిద్ధోజు శ్రీనివాస్,వేముల నాగరాజు, సిలివేరు థామస్, ఓం ప్రకాష్ కొలారియా, రామా యాదగిరి, క్యాతం రంజిత్, కేతిరి రాజశేఖర్, సిందం చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.