
Parties Strategize for Local Body Election Wins
గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల కసరత్తు!
ఎవరి వ్యూహాలు వారివే!
శాయంపేట నేటిధాత్రి:
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో పల్లెల్లో ఎన్నికల సందడినెలకొంది ఆశావాహులు రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీకి సిద్ధమ వుతున్నారు. ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు పార్టీ లకు అతీతంగా జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలను గెలుచు కుని జెడ్పి,ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.
చేసింది చెప్పాలని కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరుగ్యారెంటీలతో రూపొం దించిన పథకంలో భాగంగా రైతు భరోసా,సన్నబియ్యం, బోనస్,మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి,చేయూత ప్రభు త్వం తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం చూస్తుంది ఎమ్మెల్యే పార్టీ నేతలకు మార్గదర్శకాలు చేయనున్నారు.
సాధ్యమైనన్ని గెలవాలి భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలవాలని చూస్తుంది పార్టీ పెద్ద నేతలు దిశానిర్దేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు భూపాలపల్లి నియోజకవర్గం కార్యకర్తలకు సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రచారం చేయా లని నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని చూస్తున్నారు.
వైఫల్యాలను ఎండగట్టా లని బీఆర్ఎస్ పార్టీ కసరత్తు
టిఆర్ఎస్ నేతలు అభ్యర్థుల గెలుపునకు ప్రణాళికలు రచిస్తున్నారు మండల గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సమయతమవుతున్నారు మండల గ్రామ స్థాయిలో సమస్యలపై ప్రభావం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.