
Massive Fire at HPCL Visakhapatnam
లో భారీ అగ్ని ప్రమాదం..
విశాఖపట్నం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున పొగ, మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రమాదం సూచికగా ఫ్యాక్టరీలో సైరన్లు మ్రోగాయి. దీంతో ఉద్యోగులను హుటాహుటీన బయటకి పంపించివేశారు.
విశాఖ: HPCLలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోలియం ట్యాంక్పై ఒక్కసారిగా పిడుగు పడటంతో.. భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అలర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం ఉద్యోగులను వెంటనే బయటకు పంపించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. POL,పెట్రోకెమికల్స్ కోసం భారీ మొత్తంలో కంపెనీలో నిల్వ ఉంచినట్లు సమాచారం. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.