రామంతపూర్ డివిజన్‌లో అభివృద్ధి పనులను కార్పొరేటర్, ఎమ్మెల్యేతో కలిసి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు.
ఉప్పల్ నేటిదాత్రి
రామంతపూర్ డివిజన్‌లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సహాయ సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా
ఇంద్రనగర్ కమిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం & రిపేర్లకు రూ. 35 లక్షలు
ఇంద్రనగర్ వి ఎన్ హెచ్ స్కూల్ లేన్ సీసీ రోడ్ నిర్మాణానికి రూ. 12.50 లక్షలు
ఆర్టీసీ కాలనీ సీసీ రోడ్లు నిర్మాణానికి రూ. 35 లక్షలు
బాలకృష్ణ నగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ పనులకు రూ. 55 లక్షలు.
ఎం పీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతూ మల్కాజ్గిరి నియోజకవర్గానికి అదనపు నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రతి ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా కార్పొరేటర్ల తో కలిసి పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు మాట్లాడుతూ, డివిజన్ అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో HMWSSB జీఎం సంతోష్ కుమార్, జిహెచ్ఎంసి డీఈ నాగమణి, ఏఈ మౌనిక, స్థానిక ప్రజలు, బీజేపీ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
