Maize Procurement Halted in Narsampet Market
నర్సంపేట మార్కెట్లో మక్కజొన్న కొనుగోళ్లు తాత్కాలిక నిలిపివేత
మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సిన మక్కజొన్న బస్తాలు సుమారు 50,000 నిల్వ ఉన్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు.మార్కెట్ యార్డుకు అధికంగా మక్కజొన్నలు రావడం, తగినంత స్థలం లేకపోవడం, అలాగే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అందువల్ల, రైతులు ఈ నెల 12 నుండి తదుపరి ప్రకటన వెలువడే వరకు నర్సంపేట మార్కెట్ యార్డుకు మక్కజొన్నలను అమ్మకానికి తీసుకురావద్దని సూచించారు. లేకపోతే అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు.
