
మందమర్రి, నేటిధాత్రి:-
రానున్న వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని నర్సరీలలో మొక్కలను సంరక్షించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని మండల ఎంపీడీఓ ఎన్ రాజేశ్వర్ సూచించారు. మండలంలోని చిర్రకుంట, ఆదిల్ పేట గ్రామపంచాయతీలలోని నర్సరీలను శనివారం ఆయన సందర్శించి, నర్సరీ నిర్వాహకులకు పలు సూచనలు అందజేశారు. అనంతరం ఆయా గ్రామ పంచాయతీలలో నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను సైతం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వేసవికాలం ఎండలు ముదురుతున్నందున ఉపాధి హామీ కూలీలు ముందుగా పనికి రావాలని సూచించారు. అనంతరం నూతన మండల ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ రాజేశ్వర్ ఆదిల్ పేట గ్రామంలోని మండల ఎంపిపి గుర్ర మంగ స్వగృహంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపిపి గుర్రం మంగ, శ్రీనివాస్ గౌడ్ దంపతులు ఎంపీడీవో రాజేశ్వర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిఓ బి బీరయ్య, ఈజిఎస్ ఏపిఓ రజియా, టిఏలు, ఎఫ్ఏలు తదితరులు పాల్గొన్నారు.