
Unseasonal Rains Disrupt Life in Nekkonda
అకాల వర్షాలకు పొంగిపొర్లుతున్న ప్రధాన రహదారులు
పిడుగుపాటుకు రెండు పాడి గేదెల మృతి
#నెక్కొండ, నేటి ధాత్రి:
అకాల వర్షాలకు నెక్కొండలోని పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలగగా ఆరబెట్టుకున్నటువంటి ధాన్యం వర్షానికి కొట్టుకపోవడంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు ప్రధానంగా నెక్కొండ నుండి కేసముద్రం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై తోపనపల్లి వెంకటాపురం గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు కు వరద నీరు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అంతేకాక మొక్కజొన్నలు రోడ్లపై ఆరబెట్టడంతో సోమవారం తెల్లారిజామున హఠాత్తుగా ఒక్కసారిగా కురిచిన వర్షానికి ధాన్యం కొట్టుకపోవడంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లనే చెప్పవచ్చు. చంద్రుగొండ గ్రామంలోని దాసరి సంపత్ అనే రైతు కు సంబంధించిన రెండు పాడి గేదలు పిడుగుపాటుతో మృతిచెందగా రైతు కుటుంబ సభ్యులు బోరుణ విలపించారు. అనంతరం రెండు పాడి గేదెల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.