
మహిళా సంఘం స్థలాన్ని కాపాడాలని తహసిల్దార్ కి వినతి పత్రం
జైపూర్,నేటి ధాత్రి:
మహిళా సంఘం భవనం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కాపాడాలని తహసిల్దార్ కి మహిళా సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు.వెన్నెల వివో మహిళ సంఘం సభ్యులకు గత ప్రభుత్వం 152 సర్వే నెంబర్ లో అప్పటి ఎమ్మెల్యే మహిళా భవనం నిర్మాణం కొరకు స్థలాన్ని తహసిల్దార్ ద్వారా కేటాయించారని తెలిపారు.కానీ ఇప్పుడు కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్స్ తో రామస్వామి అనే వ్యక్తి గోదావరిఖని కి చెందిన వ్యక్తులతో కొనుగోలు చేశామని ఆగస్టు 14న నిర్మించిన జెండా గద్దెను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. తహసిల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి సదరు వ్యక్తులపై కట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెన్నెల వివో మహిళ సంఘం సభ్యులు తహసిల్దార్ వనజ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.