హన్మకొండ, నేటిధాత్రి:
హన్మకొండ లో బలసముద్రంలో ఉన్నటువంటి చక్రవర్తి హాస్పిటల్ లో బొంత మహేష్ అనే వ్యక్తి చికిత్స పొందుతు మృతి చెందడం జరిగింది వివరాల్లోకి వెళ్తే బొంత మహేష్ అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో వారం రోజుల క్రితం చక్రవర్తి హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది. కొన్ని రోజులు బాగానే ఉన్నా రెండు రోజుల నుండి మహేష్ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మహేష్ చనిపోయాడు అనీ మృతిని బందువులు అంటున్నారు మహేష్ మృతితో తన బందువులు హాస్పిటల్ అద్దలని ద్యంసం చేసారు అదేవిధంగా మృతుని బంధువుల కి బీఎస్పీ నాయకులు, విద్యార్థి కొంతమంది మద్దతుగా ఉన్నారు మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారని వారిని ఆదుకోవాలని మృతుని బంధువులు అంటున్నారు.