మహబూబ్ నగర్ / నేటి ధాత్రి
మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహించిన శోభాయాత్ర మరియు అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.