ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి
జహీరాబాద్. నేటి ధాత్రి:
మహాత్మా జ్యోతిబా పూలే గారి జన్మదిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలా మాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, సామాజిక సంఘ సంస్కర్త,సమాజంలోని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం మరియు విద్య కోసం జీవితాంతం కృషి చేసిన సంఘసేవకుడైన మహాత్మా జ్యోతీరావు ఫూలే జయంతి సందర్బంగా వారి సేవలను స్మరిస్తూ.వారికి నా ఘన నివాళులు తెలిపారు .ఈ కార్యక్రమంలో మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల, జాగృతి అధ్యక్షురాలు అనుషమ్మ ,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప, వార్డ్ అధ్యక్షులు దత్తాత్రేయ,అలి,వెంకట్,విశ్వేశ్వర్,
బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్,నాయకులు తులసి దాస్ గుప్తా,రాజ రమేష్ ,జగదీశ్వర్,ఆనందం,ప్రవీణ్ పాటిల్,ఎజాస్ బాబా,గణేష్ ,నర్సింహ రెడ్డి,దీపక్,లక్ష్మీకాంత్,మోహన్ తదితరులు పాల్గొన్నారు