ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం కోలనూర్ గ్రామంలో సమాజంలో కులవివక్ష,అంటరానితనంపై పోరాటం చేసి,వెనకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్బంగా ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మర్కెట్ మాజి చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్,నాయకులు బైరి రవి గౌడ్ ,మాజీ వార్డ్ సభ్యులు దోడ్డె శంకర్,సాతురి అనిల్,జీదుల పాపయ్య,మాటెటి గణేష్, పల్లె ప్రశాంత్,సాతురి నరేష్,సాతురి వినయ్ ,మాటురి నర్సయ్య,మాటురి దిలిప్,జీదుల రాజయ్య తదితరులు పాల్గోన్నారు.