
పాలకుర్తి నేటిధాత్రి
దసరా పండుగ సందర్బంగా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో 22 నిరుపేద కుటుంబాలకు మహాత్మ హెల్పింగ్ హ్యాండ్స్ తరపున 25 కిలోల బియ్యపు, నిత్యావసర వస్తువులు ఇవ్వడము జరిగింది. ఇందులో 18 కుటుంబాలకు మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు గంట రవిందర్, శీల అశోక్, పెండ్లి సంపత్, నల్లపు రాజశేఖర్, డాక్టర్ శ్రీనివాస్ లు ఒక్కొక్క కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమములో గంట రవిందర్ తో పాటు హైస్కూల్ చైర్మన్ లింగయ్య, ప్రైమరీ స్కూల్ చైర్మన్ కూన బోయిన కుమార్, శీల అశోక్, శరత్ రెడ్డి, నల్లపు రాజశేజర్, మహంకాళి శ్రీనివాస్, రాణా ప్రతాప్, దేవర సంపత్, గుమ్మడిరాజు పాపయ్య, నారబోయిన శ్రీను, నారాబోయిన రాజు, గంట సుధాకర్, గంట సోమేశ్, రంజాన్ అలీ, తదితరులు పాల్గొన్నారు.