
మహాత్మా గాంధీ ప్రపంచానికి ఆదర్శం.
ఫోరం అధ్యక్షులు చిగుళ్లపల్లి నర్సింలు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా మహాత్మా గాంధీ నిలిచారని సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు చిగుళ్లపల్లి నర్సింలు అన్నారు. మంగళవారం రోజు జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఫోరం అధ్యక్షులు నర్సింలు మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ప్రపంచానికి ఆదర్శమని,
గాంధీ ప్రపంచానికి సత్యం, అహింసా మార్గాలను చూపినారన్నారు.భారత దేశంలో స్వతంత్ర ఉద్యమ కారులను ఏకతాటిపైకి తెచ్చి అహింసతో దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టి, అహింసా వాదంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారని గుర్తు చేశారు.