శివుడికి అభిషేకం చేయాల్సిన సరైన విధానం

mahashivarathri
శివుడికి అభిషేకం చేయాల్సిన సరైన విధానం
ప్రతి ఏటా హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. ఆరోజు రాత్రంతా జాగారం చేసి శివధ్యానంలో నిమగ్నం కావడం వల్ల ఆ పరమశివుడు మనతోనే వున్నాడన్న భావనకు లోనవుతాం. ఆదియోగి అయిన శివుడి తలపై వున్న నెలవంక ద్వారా జ్ఞాన ప్రసరణ ప్రవాహరూపంలో ప్రసరిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివ రాత్రి పర్వదినం. 27వ తేదీ తెలతెలవారుతుండగానే భక్తులు శివాలయాలకు వెళ్లి శివుడికి అభిషే కాన్ని నిర్వహించి, శివనామస్మరణతో గడుపుతారు
mahashivarathri abhishekam
mahashivarathri abhishekam

శివలింగమంటే…
A Shivling is a symbol of Lord Shiva, and is worshipped on Mahashivratri, a major Hindu festival

అనంతమైన ప్రకృతికి చిహ్నంగా శివలింగాన్ని భక్తులు పరిగణిస్తారు. శివలింగంలోని లింగాకృతివిశ్వశక్తికి చిహ్నం. అదేవిధంగా లింగం యొక్క దిగువ భాగం ‘యోని’ స్త్రీశక్తికి ప్రతీక. ఆమెనే ఆదిశక్తి. శివలింగం రెండు భాగాలుగా వుంటుంది. ఈ రెండు భాగాలను మనం పూజిస్తున్నా మంటే శివుడితో పాటు, గణేషుడిని, కార్తికేయుడిని, అశోక్‌ సుందరి, పార్వతీ మాతను పూజిస్తున్నామని అర్థం.
తొలి పూజ
మనం ఏ పూజాకార్యక్రమం నిర్వహించినా ముందుగా గణేషుడిని అర్చించాలి. తొలిగా ఆయన్నుపూజించకుండా ఏ పూజ లేదా క్రతువు సంపూర్ణం కాదు. అందువల్ల ముందుగా శివలింగానికి కుడివైపు నుంచి పూజను ప్రారంభించాలి. అంటే లింగానికి కొద్దిగా ముందు, యోనికి సమీపంలో నీటిని వదులుతూ గణేశుడి మంత్రాన్ని స్మరించాలి.
mahashivarathri abhishekam
mahashivarathri abhishekam

రెండో పూజ

తర్వాత పూజించాల్సింది శివలింగం ఎడమభాగంలో వుండే కార్తికేయుడిని. ఈయన శివ`పార్వతుల సంతానం. దేవతల సేనానాయకుడు. దక్షిణ భారతదేశంలో మురుగన్‌ లేదా సుబ్రహ్మణ్య స్వామి పేరుతో ఈయన్ను అర్చిస్తారు. ఆయన నామాన్ని జపిస్తూ అక్కడ నీటిని వదలాలి.

మూడో పూజ
గణేషుడు, కార్తికేయుడిని అర్చించిన తర్వాత శివ`పార్వతుల మూడో సంతానమైన అశోక్‌ సుం దరిని అర్చించాలి. ఈమె పేరు చాలామందికి తెలియదు. శివలింగంలోని స్త్రీశక్తికి ఈమె ప్రతీక.ఈమెను సౌందర్య దేవతగా, వివేకాన్నిచ్చి, కోర్కెలను తీర్చే దేవతగా పరిగణిస్తారు.

అశోక్‌ సుందరి యోగి మధ్యభాగంలో, శివలింగానికి కుడిపక్క ముందుభాగంలో వుంటుంది.

mahashivarathri abhishekam
mahashivarathri abhishekam
నాలుగో పూజ
శివలింగానికి ముందుభాగంలో పార్వతీదేవికి సమర్పించే పూజ. ఇప్పుడు జలాన్ని శివలింగం ఆధారభాగం చుట్టూ కుడివైపు నుంచి ఎడమవైపునకు పోయాలి. ఈ భాగం పార్వతీదేవికి ప్రతీక. ఈవిధంగా అభిషేకజలాన్ని పోస్తున్నప్పుడు పార్వతీదేవి మంత్రాన్ని పఠించాలి. లేదా ‘ఓం నమ్ణ శివాయ’ అని పఠించినా సరిపోతుంది.
ఐదో పూజ
గణేషుడు, కార్తికేయుడు, అశోక్‌ సుందరి, పార్వతీదేవిలకు అభిషేకం చేసిన తర్వాత, ఇప్పుడు లింగ రూపంలోని శివుడిని అర్చించాలి. ఆయనకు పంచామృతాలు (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరుకురసం) మరియు గంధంతో అభిషేకించాలి. ఈ సందర్భంగా భక్తులు ఆరోగ్యం, ప్రేమ,అదృష్టం, సౌభాగ్యం కలగాలిని ఆ శివుడిని కోరుకుంటారు. 

శివాభిషేకం చేసే సమయంలో ‘ఓం నమ్ణశివాయ’ మంత్రాన్ని పఠించడం మరచిపోవద్దు. ఈ సందర్భంగా పూర్తి శ్రద్ధ, మనస్సును పూర్తిగా ఆయనపై లగ్నం చేయాలి. ఆప్పుడే ఆయన ప్రస న్నుడవుతాడు.

mahashivarathri abhishekam
mahashivarathri abhishekam

 

mahashivarathri abhishekam pooja vidhanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!