
గంగారం, నేటిధాత్రి :
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసారి సీతక్క ప్రత్యేక చొరవతో 40.కోట్ల రూపాయలతో గంగారాం మండలం లో గ్రామాలకు మహర్థషా వచ్చిందని గంగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గంగారం మండలం లోని తిరుమలగండి గ్రామ పంచాయతీ కి 5 సీసీ రోడ్లు
గంగారం గ్రామానికి 7సీసీ రోడ్లు బావురుగొండ గ్రామ పంచాయతీ కి 13సీసీ రోడ్లు కోమాట్లగూడెం గ్రామ పంచాయతీ కి 11సీసీ రోడ్లు. చింతగూడెం 2సీసీ రోడ్లు. జంగాలపల్లి గ్రామ పంచాయతీ కి 5సీసీ రోడ్లు. మర్రిగూడెంగ్రామ పంచాయతీ పరిధిలో 5సీసీ రోడ్లు. పునుగొండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో 7సీసీ రోడ్లు. దుబ్బగూడెం గ్రామ పంచాయతీ కి 7సీసీ రోడ్లు. మడగూడెం గ్రామానికి 6సీసీ రోడ్లు. కామరాం గ్రామ పంచాయతీ కి 4సీసీ రోడ్లు కోడిశాలమిట్ట గ్రామ పంచాయతీ పరిధిలో 8సీసీ రోడ్లు కు మంజూరు వచ్చాయని గంగారం మండల ప్రజల తరుపున పగిడిద్దమహారాజ్ జాతరలో మంత్రి సీతక్క కు ఫోటో బహుకరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.