చిల్పూర్( జనగాం)నేటి ధాత్రి
జిల్లా అధికారుల ఆదేశానుసారం ప్రభుత్వం ద్వారా వచ్చిన మహాలక్ష్మి పథకం సంబంధించిన పత్రాలను చిల్పూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం మండల పరిషత్ అధికారి(ఎంపీ ఓ) మధుసూదనాచారి ఆధ్వర్యంలో చిల్పూర్ మండల రేషన్ డీలర్లకు మహాలక్ష్మి పథకం పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా
ఎంపివో మాట్లాడుతూ మండలంలోని రేషన్ డీలర్లు అందరూ తమ తమ గ్రామాలలో మహాలక్ష్మి పథకం పత్రాలను ఎంపికైన లబ్ధిదారులకు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల రేషన్ డీలర్లు జయపాల్ రెడ్డి,మల్లయ్య,రాజయ్య,
మధుసూదన్,విజయ్ కుమార్,
అనురాధ,ఎల్లయ్య,రావణ్ కుమార్. కిరణ్ కుమార్,నాయక్ తదితరులు పాల్గొన్నారు.