
Mahadevpur ZPHS wins 2nd place in Science Seminar
సైన్స్ సెమినార్ లో మహాదేవపూర్ రెండో స్థానం
మహాదేవపూర్ సెప్టెంబర్ 12 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ బాలుర పాఠశాల జిల్లా సైన్స్ సెమినార్ లో గురువారం రోజున ద్వితీయ స్థానం సాధించింది. జిల్లా సైన్స్ సెమినార్ లో భాగంగా మహాదేవపూర్ జెడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాల లోని విద్యార్థులు ఉపాధ్యాయుడు బి. ప్రభాకర్ రెడ్డి సహాయంతో “క్వాంటం బెగిన్స్: పొటెన్షియల్ అండ్ చాలెంజెస్” అనే అంశంపై భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా సైన్స్ సెమినార్ లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాలేశ్వరం ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అన్నపూర్ణ ముందర ప్రజెంటేషన్ చేసి న్యాయ నిర్ణీత రాజేంద్రప్రసాద్ ల ముందర జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం పొంది ముఖ్య అతిథుల చేతుల మీదుగా 9వ తరగతి చదువుతున్న సల్పాల సంకీర్తన ప్రశంసపత్రం అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, జిల్లా స్థాయి అధికారులు, ప్రతినోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.