
నిజాంపేట: నేటి ధాత్రి
మండల కేంద్రంలో గల శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.. ఈ మేరకు దేవాలయం వద్ద గురువారం యజ్ఞ కార్యక్రమాన్ని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యజ్ఞ కార్యక్రమంలో దంపతులు కూర్చొని యజ్ఞ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం అమ్మవారి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాయంత్రం పూట పోచమ్మ బోనాలు తీయడం జరిగిందని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు.