
Maha Ganapathi Homam and Annadanam in Kohir
మహాగణపతి హోమం, అన్నదానం, సామూహిక దీపారాధన
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఓంకార పట్టణం కోహిర్ గ్రామంలో సార్వజనిక వినాయక మండలి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాగణపతి హోమం, అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే కొల్లాపూర్ మాణిక్ రావు మహాగణపతిని దర్శించుకున్నారు. అనంతరం మహిళలు సామూహిక దీపారాధన చేశారు.