
Mega Annadanam at Mamatha Nagar Ganesh Temple
మమతా నగర్ గణనాధుని సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని పదో వార్డు మమత నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ దాత తాళ్లపల్లి వెంకటేశ్వర్లు కవిత ల సహకారంతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్న నేపథ్యంలో మమతా నగర్ కాలనీవాసులు ముప్పిడి రంజిత్ మమత,దార్న రవీందర్ సత్యవతిలచే స్వామివారి సన్నిధానంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు గణేష్ మహారాజ్ కి జై అంటూ స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల నిర్వాహణ అనంతరం స్వామివారి మహా అన్నప్రసాద వితరణను స్వీకరించి స్వామి వారి కృపకు ప్రాప్తులైనట్లు మహా అన్నప్రసాద వితరణ దాతలు ముప్పిడి రంజిత్ దార్న రవీందర్తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు పరకాల పట్టణంలోనే మమతా నగర్ గణనాథుడు పెట్టింది పేరుగా నవరాత్రి తొమ్మిది రోజులు మమతా నగర్ కాలనీ వాసులంతా ఒక పండగ వాతావరణంను ఏర్పాటు చేసుకుంటూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని,ఈ నేపథ్యంలో శనివారం రోజున నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంకు విచ్చేసి కార్యక్రమమును విజయవంతం చేసిన కాలనీవాసులకు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.