నర్సంపేట టౌన్,నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోగల పదో వార్డులోని పోచమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా విఘ్నేశ్వరుని మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టగా నాగిశెట్టి ప్రణీత ప్రవీణ్, ఎదరబోయిన మౌనిక నవీన్,
తాళ్లపెల్లి కళ్యాణి సతీష్,
పస్తం కోమల కృష్ణ,
అదర్సండే రమాదేవి రాజు,
మిడిదొడ్డి రాధ బిక్షపతి,
అమిరిశెట్టి రాజేష్ మహా అన్నదాన దాతలుగా అన్నదానం చేశారు. స్థానిక కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి నిరంతరం భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రామంలో పట్టణంలోని ప్రముఖులు, డాక్టర్స్, విద్యావేత్తలు, వార్డులోని ప్రజలు పోచమ్మ యూత్, మహిళలు, పిల్లలు, గణేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ముందుగా గణపతి విగ్రహం వద్ద కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు నిషాంత్ శర్మ సహకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.