పరకాల పట్టణంలోని హరిహర అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ గురు స్వామి మాణిక్యం బాపూరావు ప్రారంభించారు.ఆలయ నిర్మాణ కర్త పరకాల ప్రముఖ వైద్యుడు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ చే నిర్మించిన అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరం నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగా గురువారం నుండి జనవరి ఆరవ తారీఖు వరకు నిత్య అన్నదానం జరుగుతుందని ఆలయ నిర్వహణ కమిటీ తెలిపారు. అన్నదానంలో పాల్గొనేవారు ఆలయ క కమిటీని సంప్రదించగలరు అని ఆలయ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు దేశపతి,రాజు,గోపీనాథ్ యాదగిరి,ఏదుల రమేష్,సిద్ధం శెట్టి రాజు,భద్రయ్య,విజయ్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.