
చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో 500 ఏళ్ల నిరీక్షణ, కోట్ల మంది హిందువుల కల, లక్షల మంది ప్రాణాల త్యాగాఫలం ప్రభు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య నగరంలో శ్రీ రామ విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్బంగా శ్రీ హనుమాన్ దేవాలయం వద్ద తేదీ 22 సోమవారం రోజున గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు శనివారం రోజున తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమానికి మల్యాల గ్రామ ప్రజలతో పాటు చందుర్తి మండల చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.