గంగాధర నేటిధాత్రి :
గణపతి నవరాత్రుల ఉత్సవం భాగంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని మాల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం శనివారం రోజు అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరిగింది. మండలంలో వివిధ గ్రామాల్లో వినాయక మండపాల నిర్వాహకులు మహానదానాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంగాధర ఎస్ఐ నరేందర్ రెడ్డి హాజరయ్యారు.భక్తులందరూ ఆ గణనాధుని ఆశీస్సులు పొంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.