జాతరలో పాల్గొన్న గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం జోగంపల్లి గ్రామ శివారులో ప్రతీ రెండేళ్లకొకసారి జరిగే శ్రీ సమ్మక్క – సారలమ్మ మినీ మేడారం కనులపండువగా సాగుతోంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రసత్యనారాయణ రావు జాతరలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జాతరలో భక్తులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా వాటర్ బాటిల్స్ ను అందించారు. జాతరలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ను సందర్శించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని పలు శాఖల అధికారులను ఆదేశించారు. అదేవిధంగామినీ మేడారంగా కొలిచే జోగంపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి అశేష భక్త జనం తరలి వచ్చి,కొలిచిన వెంటనే కోరికలు నెరవేర్చే, వన దేవత లైన సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తుబంగారంఅర్పిస్తారు,కాగా బుధవారం రోజున అడవి నుంచి సారలమ్మ ,పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి ప్రవేశంతో ప్రారంభమై,తర్వాత రోజున
గురువారం రోజున గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై కొలువు దీరడం మరియుశుక్రవారం రోజున భక్తులు అమ్మవార్లకు మొక్కులు,నిలువెత్తు బంగారం సమర్పించుకుంటారు. శనివారం రోజున సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.