
పరకాల నేటిధాత్రి
శనివారం రోజున డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి మంద సురేష్ పరకాల డివిజన్ నూతన కమిటీని నియమించడం జరిగింది.డివిజన్ అధ్యక్షులుగా మడికొండ వరుణ్,ఉపాధ్యక్షులుగా చిలువేరు మహేష్,సహాయ కార్యదర్శి నిశాంత్ లను ఎన్నుకోవడం జరిగింది.అనంతరం సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కూ ఉపాధి కల్పించాలని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ఫీజుల నియంత్రరించినపై ఎన్నో పోరాటాలు చేయడానికి నూతన కమిటీ ఎన్నుకోవడం జరుగుతున్నాదని ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రతి మండలాలలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మేనిఫెస్టో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.