
గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న మడికొండ శ్రీను
పరకాల నేటిధాత్రి
సోమవారం రోజున కాకతీయ యూనివర్సిటీలో జరిగిన 23 వ స్నాతకోత్సవం కార్యక్రమంలో డాక్టర్.మడికొండ శ్రీనుకి ప్రభుత్వ పాలన శాస్త్ర విభాగంలో పిహెచ్డి డాక్టరేట్ పట్టా ప్రధానం చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్.ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ఛాన్సలర్ జిష్ణు దేవ్ వర్మ,వైస్ ఛాన్సెలర్ ప్రతాప్ రెడ్డి,ఎగ్జామ్ నేషన్ కంట్రోలర్ రామ్ చంద్రం, మరియు కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.