అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన మాదిగ సంఘాలు.
భద్రాచలం నేటి దాత్రి
స్థానిక అంబేద్కర్ సెంటర్ భద్రాచలం నందు మహాజన సోషలిస్టు పార్టీ ,ఎమ్మార్పీఎస్, ఎంఎంఎస్ ఇతర మాదిగ సంఘాల ఆధ్వర్యంలో
మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతామని నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియర్, మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు గురజాల వెంకటేశ్వర్లు మాదిగ లు మాట్లాడుతూ…..
మాదిగలను అవమానించిన కాంగ్రెస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామని,
పార్లమెంట్ సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మూడు సీట్లు ఉంటే,రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసిందని,
ఎస్సీల్లో జనాభాలో 20% గల మాలలకు రెండు సీట్లు కేటాయించి, ఊరుకొక్కరు లేని బైండ్ల కులానికి ఒక సీటు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎస్సీ జనాభాలో 75% గల మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాదిగల మద్దతుతోనే నేను ఈ స్థాయికి ఎదిగిన అని,నా సొంత కులం నన్ను పట్టించుకోకపోయినా మాదిగలు మాత్రం నా ప్రతి ఎదుగుదలలో వెన్నంటి ఉన్నరని అనేక వేదికల మీద మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాదిగలకు అవకాశాలను ఇవ్వకుండా అవమాన పరుస్తూ నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని అన్నారు.
మాదిగలకు ద్రోహం చేసిన పార్టీలన్నీటిని భూస్థాపితం చేశామని కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం మాదిగలమంతా ఏకమవుతామని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో MSP, జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల తిరుపతి MRPS సీనియర్ నాయకులు కుమ్మరి వెంకటేశ్వర్లు ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మేకల లత, ఉపాధ్యక్షురాలు కొప్పుల నాగమణి, ఎమ్మార్పీఎస్ నాయకులు కొట్టేసాయి ఇప్పడపల్లి సతీష్ మాదిగ, ఎమ్మెస్పీ నాయకులు చిన్న బేరి మనీ , మేడ్చల్ లక్ష్మణ, గడ్డం బాబుఇసంపల్లి ముత్యం, తదితరులు పాల్గొన్నారు.